అస్సామి నటుడు కిశోర్ దాస్ క్యాన్సర్‌తో చికిత్స తీసుకుంటూ మరణించాడు. ఇంత చిన్న వయసులోనే యువ హీరో మరణించడం ఇండస్ట్రీని విషాదంలో ముంచెత్తింది. టీవీ సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన కిశోర్ దాస్ 300కు పైగా మ్యూజిక్ అల్బబ్స్లో నటించాడు. ఇటీవలే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అంతలోపే అతడికి క్యాన్సర్ ఉందని తెలిసింది. చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న కిశోర్ దాస్‌కు కరోనా సోకడంతో మరణించాడు. కొంతకాలం క్రితమే తాను చికిత్స తీసుకుంటున్నానని త్వరలోనే తిరిగి వస్తానని సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంతలోనే ఇలా జరగడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కిశోర్ దాస్‌కు కరోనా సోకడంతో అంత్యక్రియలను చెన్నైలోనే నిర్వహించనున్నారు.
క్యాన్సర్‌తో యువహీరో మృతి

Courtesy Instagram: kishordas