నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ నజీర్ అహ్మద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం శాసనసభ, శాసనమండలి బీఏసీ సమావేశాలు జరుగుతాయి. మధ్యాహ్నం కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. కాగా ఈ నెల 17న ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకశాం ఉంది. 18న పెట్టొచ్చనే చర్చ కూడా నడుస్తోంది. దీనిపై నేడు క్లారిటీ రానుంది. 2023-24 బడ్జెట్ రూ.2.60 లక్షల కోట్లు ఉండనున్నట్లు సమాచారం. ఈ నెల 24 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి.