దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ముగ్గురు నిందితులకు సంబంధించిన ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ ఇళ్లతో పాటు దినేశ్ అరోరాకు సంబంధించిన స్థిరాస్తులను అటాచ్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే లోతుగా విచారిస్తున్న ఈడీ…. లోగుట్టును లాగేందుకు కీలక ఆధారాలు సేకరించిందని తెలుస్తోంది.