దేశంలో తీవ్ర ఆందోళనలకు కారణమవుతున్న అగ్నిపథ్ పథకాన్ని మాజీ సైన్యాధిపతి వీపీ మాలిక్ సమర్థించారు. పథకాన్ని వ్యతిరేకిస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడే పోకిరీలపై ఆర్మీ ఎన్నటికీ ఆసక్తి చూపదని స్పష్టం చేశారు. బస్సులు, రైళ్లు తగలబెడుతూ గూండాయిజం చేసేవారిని సైన్యం కోరుకోదన్నారు. సాయుధ బలగాలు స్వచ్ఛంద సంస్థ కాదు. స్వచ్ఛందంగా దేశకోసం పనిచేసే సంస్థ. విధ్వంసానికి పాల్పడేవారు ఇందులో పనికిరారని వీపీ మాలిక్ అన్నారు. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యాన్ని విజయపథంలో నడిపించిన సైన్యాధిపతి వీపీ మాలిక్ ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ వ్యాఖ్యలు చేశారు.