సాధారణంగా స్టేడియాలకు క్రికెట్ దిగ్గజాల పేర్లు పెడుతుంటారు. కానీ, జాతీయ జట్టులో అరంగేట్రం చేయని ఓ ఆటగాడి పేరు మీద మైదానం ఉంది. అంతేకాదు, అదే మైదానంలో ఆ యువ క్రికెటర్ మ్యాచ్ ఆడి సెంచరీని బాదాడు. అతనే బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్. ఆ స్టేడియం పేరు ‘అభిమన్యు క్రికెట్ అకాడమీ స్టేడియం’. రంజీల్లో ఉత్తరాఖండ్ జట్టుపై తొలిరోజు 141 పరుగులు చేసి అభిమన్యు అజేయంగా నిలిచాడు. కాగా, ఈ స్టేడియాన్ని అభిమన్యు తండ్రి రంగరాజన్ నిర్మించాడు. అభిమన్యు పుట్టకముందే ఈ స్టేడియంకు ఆ పేరు పెట్టడం గమనార్హం. ఈ స్టేడియం డెహ్రాడూన్‌లో ఉంది.