పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓసారి బాబర్‌ను కొట్టేంత కోపం వచ్చిందని చెప్పాడు. ‘అకాడమీలో క్రికెట్ ప్రాక్టీస్ కోసం బాబర్ అజామ్ వచ్చేవాడు. నా బౌలింగ్‌లో స్ట్రెయిట్ డ్రైవ్ కొట్టొద్దని బాబర్‌తో చెప్పా. కానీ, అతడు అలాగే కొట్టేశాడు. ఒక బంతి అయితే నాకు తాకింది. నిన్ను వదలిపెట్టే ప్రసక్తే లేదని మనసులోనే అనుకున్నా. అప్పుడే ముదస్సర్ వెంటనే బాబర్‌ను బయటకు వచ్చేయమని చెప్పాడు. లేకపోతే నేను బాల్‌తో కొట్టేస్తానని అతడిని హెచ్చరించాడు’ అని అక్తర్ చెప్పాడు.