AP: నూతన సంవత్సర వేళ.. ఓ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కబడ్డీ ఆడుతూ విజయనగరం జిల్లాలో ఓ యువకుడు మృతిచెందాడు. జిల్లాలోని ఎరుకొండ- కొవ్వాడ గ్రామస్థుల మధ్య కబడ్డీ మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో కొవ్వాడకు చెందిన 18ఏళ్ల రమణ.. రైడర్ని టాకిల్ చేయబోతుండగా తలకు గాయమైంది. దీంతో హుటాహుటిన రమణను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడవడంతో విషాదం నెలకొంది. తండ్రి కూలీగా పనిచస్తుండగా.. బాబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రమణకు ఒక తమ్ముడు ఉన్నట్లు సమాచారం.