ఘనంగా ముగిసిన ఆటా వేడుకలు

Courtesy Twitter:thaman

అమెరికాలో మూడ్రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆటా వేడుకలు ఘనంగా ముగిశాయి. తెలుగు జనం సమావేశాలకు పోటెత్తారు. సద్గురు జగ్గీ వాసుదేవ్, కపిల్ దేవ్, సునీల్ గావస్కర్, క్రిస్ గేల్ సహా పలువురు సినీ ప్రముఖులు వేడుకలకు హాజరయ్యారు. కార్యక్రమంలో సుమారు15వేల మంది పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన గోల్ఫ్ టోర్నమెంట్ లో కపిల్, సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్, సద్గురు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మపై ఆటా ముద్రించిన పుస్తకాన్ని కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. శివమణి, థమన్‌ కలిసి శ్రోతలను ఉర్రూతలూగించారు.

Exit mobile version