నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ రేపు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 279 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 14 మంది ఎన్నికల బరిలో ఉండగా.. వారిలో వైసీపీ, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. టీడీపీ, జనసేన ఈ ఎలక్షన్‌కు దూరంగా ఉన్నాయి. కాగా దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి మృతి చెందడంతో ఖాళీ ఏర్పడిన స్థానం భర్తీ చేయడానికి ఎన్నికలు అనివార్యం అయ్యాయి.