సౌత్ కొరియాలోని ఓ ఇంట్లో 1000 కుక్కలు చనిపోవడం కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి ఆ కుక్కలకు ఆహారం పెట్టకుండా కడుపు మాడ్చి ఆకలితో అలమటించేలా చేసి అవి చనిపోయేటట్లు ప్రవర్తించాడు. నిందితుడిని గ్యాంగి ఫ్రావిన్స్‌లోని యంగ్‌ప్యోంగ్‌కు చెందిన 60 ఏళ్ల వృద్ధుడిగా పోలీసులు గుర్తించారు. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క తప్పిపోవడంతో దానిని వెతుక్కుంటూ నిందితుడి ఇంటికి వెళ్లటంతో దారుణం బయటపడింది. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.