దిల్లీలో విషాధం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు. దిల్లీలోని వసంత్ కుంజ్ అటవీ ప్రాంతంలో బాధిత కుటుంబం నివసిస్తోంది. 10వ తేదీన ఆనంద్ (7) అనే బాలుడు ఆడుకుంటూ అడవిలోకి వెళ్లగా కుక్కలు దాడి చేసి చంపేశాయి. రెండ్రోజుల తర్వాత ఆనంద్ తమ్ముడు ఆదిత్య (5) తన స్నేహితుడితో కలిసి అడవిలోకి వెళ్లగా అతడిపైనా తీవ్రంగా దాడి చేశాయని పోలీసులు తెలిపారు. ఆదిత్యను ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వివరించారు.