గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. పెదకకాని మండలం తక్కెళ్లపాడులో ఎంబీబీఎస్ విద్యార్థినిపై ఓ యువకుడు హత్యాయత్నం చేశాడు. తపస్వి అనే యువతిపై జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి సర్జికల్ బ్లేడుతో దాడి చేశాడు. ఆమెకు తీవ్ర గాయాలవ్వటంతో ఆస్పత్రికి తరలించారు. యువతిపై దాడి అనంతరం అతడి చేయిని బ్లేడుతో కోసుకున్నాడు. నిందితుడు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. అతడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు.