బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఇద్దరు ట్రైన్ టికెట్ కలెక్టర్లు సస్పెండ్ అయ్యారు. ప్రయాణికుడిపై విచక్షణా రహితంగా దాడిచేయడమే ఇందుకు కారణమైనట్లు తెలుస్తోంది. విధుల్లో ఉన్న టీసీలు సాధారణ తనిఖీలు చేస్తుండగా ఓ ప్రయాణికుడు టిక్కెట్టు లేకుండా జర్నీ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో జరిమానా కట్టాలని ప్రయాణికుడికి టీసీలు సూచించారు. అతడు దాక్కోవడానికి ప్రయత్నించడంతో కాళ్లు పట్టుకుని బయటికి లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాళ్లను వదిలించుకోవడానికి సదరు ప్రయాణికుడు ట్రై చేయగా.. కోపంతో టీసీలు చితకబాదారు. షూ వేసుకున్న కాళ్లతోనే ఇష్టారీతిన దాడిచేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో సదరు టీసీలు సస్పెండయ్యారు.