కేరళలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విళింజం పోలీస్ స్టేషన్‌పై ఆందోళనకారులు దాడికి దిగారు. ఈ దాడిలో 40 మంది పోలీసులు గాయపడ్డారు. 5 పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆదోళనకారులు ఇనుపరాడ్లు, కర్రలు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించి 3,000 మందిపై కేసులు నమోదు చేశారు. కాగా అదానీ సంస్థ విళింజంలో పోర్టు నిర్మిస్తోంది. పోర్టు నిర్మిస్తే తమ బతుకుదెరువు పోతుందని స్థానిక మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలో భాగంగానే దాడికి దిగారు.