పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ పై సోమవారం రాత్రి దాడి జరిగింది. ఈ సంఘటన పంజాబ్ లోని మొహాలీలో చోటుచేసుకుంది. ఆగంతకులు రాకెట్‌తో నడిచే గ్రెనేడ్ తో దాడి చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో కిటికీ అద్దాలు పగిలినట్లు తెలిపారు. ఒక వాహనంలో గుర్తుతెలియని వ్యక్తులు ప్రధాన ద్వారం నుంచి RPG కాల్పులు జరిపి పారిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. ఆ ఆయుధం చైనాలో తయారైనట్లు చెబుతున్నారు.