సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగింది. కర్ణాటక బళ్లారిలోని మున్సిపల్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఫెస్టివల్లో పాల్గొని వెళ్తుండగా కొందరు యువకులు ఆమె కారుపై రాళ్లు రువ్వారు. దీంతో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. కార్యక్రమం ముగిసిన తర్వాత మంగ్లీని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఝులిపించారు. ఆమె కన్నడలో మాట్లాడలేదని యువకులు దాడికి దిగినట్లు తెలుస్తోంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
-
Screengrab Instagram: iammangli -
Screengrab Instagram: