ఢిల్లీలోని జేఎన్యూ క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని మోదీ బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ చూస్తుండగా ఓ వర్గం విద్యార్థులపై దాడి జరిగింది. కరెంట్ కట్ చేసి వారిపైకి దాడికి దిగారు. ఇంటర్నెట్, కరెంట్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆ విద్యార్థులు ల్యాప్టాప్లు, మొబైళ్లలోనే మోదీ డాక్యుమెంటరీ చూశారు. కాగా 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి మోదీకి వ్యతిరేకంగా బీబీసీ ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ వివాదాస్పదంగా మారింది.