బాలికలను వేధిస్తున్న ఓ యువకుడి ఇంటిపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ ఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీఎన్ తిమ్మాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేడబోయిన యాకేశ్ కొన్నాళ్లుగా ఇద్దరు మైనర్ బాలికలను వేధిస్తున్నాడు. తాజాగా ఆ ఇద్దరు బాలికలను తన ఇంటిలో బంధించడంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు ఆ యువకుడి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అతడి ఇంటితో పాటు రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.