తమిళనాడు మైలాడుదురైలో అర్ధరాత్రి యువకులు వీరంగం సృష్టించారు. విఘ్నేష్ అనే యువకుడు ఓ యువతిని కొంతకాలంగా ప్రేమించమని వేధిస్తున్నాడు. ఆమె మాత్రం అతడి ప్రేమను నిరాకరిస్తూ వస్తోంది. దీంతో మంగళవారం అర్ధరాత్రి యువకుడు 15 మంది స్నేహితులను తీసుకెళ్లి యువతి ఇంట్లోకి చొరబడ్డాడు. యువతిని ఎత్తుకుపోతుంటే అడ్డుపడ్డ కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.