• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 100మందితో దాడి.. యువతి కిడ్నాప్

    రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది. సుమారు 100మంది దాడికి దిగి.. ఇంట్లో ఉన్న యువతిని అపహరించుకుని వెళ్లారు. స్థానిక వ్యాపారి అయిన నవీన్ రెడ్డి ఇదంతా చేయించాడని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అక్కడున్న నవీన్ రెడ్డి దుకాణాన్ని తగలబెట్టారు. కాగా, దాడి జరుగుతున్న సమయంలో 100కి కాల్ చేసినా పోలీసులు మిన్నకుండిపోయారని, ఈ కిడ్నాప్ కేసులో వారి ప్రమేయం కూడా ఉందని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. ఇంట్లోకి వచ్చి వీరవిహారం చేశారని.. సామగ్రిని ధ్వంసం చేసి తమ కుమార్తెను తీసుకెళ్లారని పోలీసులకు వారు తెలిపారు.