అనుమతి లేకుండా చేపలు పట్టారనే కారణంతో గిరిజనుల బట్టలు ఊడదీసి, చెట్టుకు కట్టేసి కొట్టిన దారుణ ఘటన వరంగల్ జిల్లాలో వెలుగుచూసింది. నల్లబెల్లి మండలం అర్షనపల్లిలో నలుగురు వ్యక్తులు చేపలు పట్టేందుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న చెరువు కాంట్రాక్టర్ అక్కడికి చేరుకోగా అందరూ పారిపోయే ప్రయత్నం చేశారు. ఇందులో ఒకరు మాత్రం పట్టుబడ్డారు. అతడిని గుడ్డలూడదీసి చెట్టుకు కట్టేసి దాడి చేశారు. పారిపోయినవారిలో ఓ వ్యక్తి తిరిగొచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించగా అతడిని అలాగే అవమానించారు. గ్రామపెద్దలు చేరుకుని అనుమతి లేకుండా చేపలు పట్టినందుకు రూ.25 వేలు జరిమానా చెల్లించాలని తీర్పు చెప్పారు.