తనకు మహిళా కమిషన్ నుంచి నోటీసులు రాలేదని టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఒక వేళ నోటీసులు వస్తే కమిషన్ ముందు విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు పంపింది. మహిళల గౌరవాన్ని కించపరిచేలా సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని కమిషన్ ఆదేశించింది.