యూట్యూబ్ పుణ్యమా అని చాలామంది వారిలోని టాలెెంట్ ఉపయోగించి ఆదాయం పొందుతున్నారు. బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్ నుంచి వచ్చిన సొమ్ముతో ఆడి కార్ కొన్నాడు. ఔరంగాబాద్ జసోయా వాసి హర్ష్ రాజ్‌పుత్ కామెడీ వీడియోలు చేస్తుంటాడు. వాటిని ఎక్కువమంది వీక్షిస్తుండటంతో నెలకు రూ. 8 లక్షలు సంపాదన వస్తోంది. ధాకడ్ అనే న్యూస్ రిపోర్టర్ అనే పేరుతో చేస్తున్న హర్ష్‌కి 33 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. రూ. 50 లక్షల ఆడీ కారును పశువుల దొడ్డి వద్ద ఉంచుతున్నాడు.