మునుగోడుకు ఈనెల 21న అమిత్ షా..కీలక నేతలు బీజేపీలో చేరిక

© ANI Photo

తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా టూర్ ఫిక్సైంది. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు మునుగోడు బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ వెల్లడించారు. ఈ సభకు BJP జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఇదే సభలో మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కుమారుడు శ్రీరాం సహా పలువురు నేతలు బీజేపీలో చేరనున్నట్లు తరుణ్ చుగ్ వెల్లడించారు.

Exit mobile version