APSRTC ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు

© Envato

APSRTCలో ఉద్యోగులకు ఆగస్టు నుంచి నూతన పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని జిల్లాల రవాణా శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో అధికారులు స్పష్టం చేశారు. ఆర్టీసీలో గత రెండున్నరేళ్లలో పదోన్నతులు పొందినవారు మినహా మిగిలిన ఉద్యోగులకు నూతన పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు జూన్ నుంచి పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలిచ్చింది. కానీ ఆర్థికశాఖలో పలు కారణాలతో పాత వేతనాలనే చెల్లించారు.

Exit mobile version