బోర్డర్-గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ పోరాడుతోంది. ప్రస్తుతం 3 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది. కాగా జట్టు స్కోరు 245 పరుగుల వద్ద సెంచరీ వీరుడు శుభ్‌మన్ గిల్(128) ఔటయ్యాడు. నాథన్ లయన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటై పెవిలియన్ బాట పట్టాడు. గిల్ డీఆర్ఎస్‌కు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. గిల్ ఔటైన అనంతరం రవీంద్ర జడేజా క్రీజులొకొచ్చాడు. విరాట్ కోహ్లీ(32) ఆచితూచి ఆడుతున్నాడు.