ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ డానియెల్ క్రిస్టియాన్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రిస్టియాన్ 2010లో అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేశాడు. ఆసీస్ తరఫున 20 వన్డేలు, 23 టీ20 మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 388 పరుగులు, 33 వికెట్లు సాధించాడు. 2021 తర్వాత క్రిస్టియాన్ ఆసీస్ జట్టులో చోటు కోల్పోయాడు. ఇక అతడు ఐపీఎల్లో కూడా పలు జట్ల తరఫున ఆడాడు. డెక్కన్ ఛార్జర్స్, ఆర్సీబీ, ఢిల్లీ డేర్ డెవిల్స్లకు ప్రాతినిధ్యం వహించాడు.