ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్, వన్డేలకు గుడ్‌బై చెప్పాడు. టీ20ల్లో మాత్రం కొనసాగుతానని మార్ష్ పేర్కొన్నాడు. 2019లోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. షాన్ మార్ష్ ఆసీస్ తరఫున 73 వన్డేల్లో 2,773 పరుగులు చేశాడు. అలాగే 38 టెస్టుల్లో 2,265 పరుగులు చేశాడు. కాగా 39 ఏళ్ల షాన్ మార్ష్ ఐపీఎల్‌లో పంజాబ్ తరఫున అత్యుత్యమ ప్రదర్శన చేశాడు. 2008 సీజన్‌లో ఒక సెంచరీ సహా 5 అర్థ సెంచరీలతో 616 పరుగులు చేశాడు. ఆ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.