టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలిరోజు లంచ్ విరామానికి 75 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్(2*), ఉస్మాన్ ఖవాజా(27*) ఉన్నారు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(32)తో కలిసి ఖవాజా ఆసీస్‌కు శుభారంభాన్ని ఇచ్చాడు. హెడ్ దూకుడుగా ఆడే ప్రయత్నంలో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన లబుషేన్ 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. షమి వేసిన బాల్‌ని తప్పుగా అంచనా వేయడంతో ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్లను తాకింది. అశ్విన్, షమి పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు.