అఫ్గాన్‌లో మహిళలపై విద్యాపరమైన ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గానిస్థాన్‌తో మార్చిలో జరగాల్సిన వన్డే సిరీస్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అఫ్గాన్ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించడంలో క్రికెట్ ఆస్ట్రేలియా సహకరిస్తుందని పేర్కొంది. ప్రభుత్వం అనుమతి తీసుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. కాగా, ఫిబ్రవరిలో భారత్‌తో ఆసీస్ టెస్టు సిరీస్ ఆడనుంది.