పాకిస్తాన్తో జరుగుతున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్లో కంగారూలు మొదటి మ్యాచులో విజయం సాధించి సిరీస్లో 1-0 తేడాతో ముందడుగు వేశారు. 88 పరుగుల భారీ తేడాతో ఆసీస్ ఈ మ్యాచులో నెగ్గింది. టాస్ గెలిచి పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. కంగారూ బ్యాట్స్మెన్ చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 313 పరుగుల భారీ స్కోరు చేయగల్గింది. చేధనలో పాకిస్తాన్ తడబడడంతో ఆసీస్ గెలుపు సులువయింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో హెడ్, పాక్ ఇన్నింగ్స్లో ఇమామ్ ఉల్ హక్ సెంచరీలతో మెరిశారు. రెండో వన్డే రేపు లాహోర్లో జరగనుంది.