దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాక్టరీల నుంచి డీలర్‌షిప్‌ల వరకు ఫిబ్రవరి నెలలో హోల్ సేల్ సేల్స్ 23 శాతం తగ్గాయి. సెమీకండక్టర్ కొరతతో సహా కొత్త నిబంధనల అమలు కారణంగా వాహనాల ధరల పెరుగుదల కూడా అందుకు కారణమని SIAM తెలిపింది. దేశీయ ప్రయాణీకుల వాహనాలు ఫిబ్రవరి 2021లో 17,35,909 యూనిట్లతో పోలిస్తే గత నెలలో 23 శాతం క్షీణించి 13,28,027 యూనిట్లకు పడిపోయాయి. మొత్తం మీద ఫిబ్రవరి 2022లో ప్రయాణీకుల వాహనాల పంపిణీలు 6 శాతం క్షీణించి 2,62,984 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాల హోల్‌సేల్స్ ఫిబ్రవరిలో 10,37,994 యూనిట్లకు తగ్గాయి. గత ఏడాది ఇదే నెలలో 14,26,865 యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 27 శాతం పడిపోయాయి.