హైదరాబాద్ జేఎన్టీయూ పరిధిలోని అటానమస్ ఇంజినీరింగ్ కళాశాలలు మరో యూనివర్సిటీ కిందకు మారాలని నిర్ణయం తీసుకున్నాయని తెలుస్తోంది. జేఎన్టీయూలో కొందరు అధికారుల ఏకపక్ష నిర్ణయాలపై యాజమాన్యాలు అసంతృప్తిగా ఉన్నాయి ఇప్పటికే వారు ఎదుర్కొంటున్న సమస్యలపై లేఖను సిద్ధం చేశారట. ఉస్మానియా యూనివర్సిటీలోకి మార్చాలని ఉన్నత విద్యామండలి, మంత్రులకు విన్నవించనున్నారు. కొందరు కావాలనే ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ.