డిసెంబరు 16న విడుదలైన ‘అవతార్2’ సినిమా ప్రపంచ రికార్డులను కొల్లగొడుతోంది. ఏకంగా 1.5 బిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. 1.4 బిలియన్ డాలర్లతో టాప్ క్రూజ్ నటించిన టాప్ గన్ మ్యావ్రిక్ సినిమా రెండో స్థానానికి పరిమితమైంది. విడుదలై 21 రోజులు పూర్తయినా ఇప్పటికీ థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుతాలను తిలకించేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. భారత్‌లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తోంది. అత్యధికంగా అమెరికా, కెనడాల్లో ఈ సినిమా వసూళ్లను రాబట్టింది.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం