విడుదలకు ముందే అవతార్2 రికార్డులను కొల్లగొడుతోంది. ప్రీమియం ఫార్మాట్లో 45 స్క్రీన్లలో అడ్వాన్స్ ఓపెనింగ్స్ మొదలైన మూడు రోజుల్లోనే 15వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ప్రీమియం ఫార్మాట్‌కే ఇలా ఉంటే సాధారణ బుకింగ్స్ మొదలైతే ఇంకా ఎలా ఉంటుందోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ‘అవతార్ సినిమాకు భారీ స్పందన వచ్చింది. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సినిమాలకు ఇండియాలో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు అవతార్2కి రెట్టింపు స్పందన లభిస్తోంది. కేవలం ప్రీమియం ఫార్మాట్‌కే మూడు రోజుల్లో 15వేల టికెట్లు అమ్ముడవడం ఆశ్చర్యం కలిగిస్తోంది’ అని పీవీఆర్ పిక్చర్ సీఈవో జియా చందాని వెల్లడించారు.