మే 9న పలు యూట్యూబ్ ఛానెల్స్‌లో అధికారికంగా విడుదలైన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ టీజర్ ట్రైలర్ విశేష ఆదరణ పొందుతోంది. విడుదలైన 24 గంటల్లోనే 148 మిలియన్ వ్యూస్ సాధించి దూసుకెళ్తుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ‘అవతార్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. నిజానికి గతేడాది డిసెంబర్‌లోనే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఆలస్యమైంది.