మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మూడోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే జనవరి 28న ఒకసారి, ఫిబ్రవరి 24న రెండోసారి ఆయన్ను సీబీఐ ప్రశ్నించింది. అవినాష్ రెడ్డి సమాధానాలతో సంతృప్తి చెందని సీబీఐ తిరిగి మూడోసారి ఆయన్ను పిలిపించుకొని విచారణ చేస్తోంది. కాగా సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డి పిటిషన్ వేశారు.