శబరిమల ‘అరవణ ప్రసాదం’ విక్రయాలను వెంటనే నిలిపేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రసాదంలో వినియోగించే యాలకుల్లో రసాయనాల పరిమాణం మోతాదుకు మించి ఉండటం వల్ల ట్రావెన్కోర్ బోర్డుకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. యాలకులు లేని, ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించిన యాలకులతో చేసిన ప్రసాదాలను విక్రయించుకోవచ్చని స్పష్టం చేసింది. అరవణ ప్రసాదంలోని యాలకుల్లో వినియోగించిన 14 రకాల రసాయనాలు మోతాదుకు మించి ఉన్నాయని అయ్యప్ప స్పైసెస్ అనే కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేస్తూ న్యాయస్థానం తీర్పును ఇచ్చింది.