హెచ్సీఏ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని మాజీ పాలక వర్గ సభ్యులు డిమాండ్ చేశారు. తాజా మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఒంటెద్దు పోకడలతో రెచ్చిపోతున్నారని వారు ధ్వజమెత్తారు. హెచ్సీఏ పాలకవర్గ గడువు సెప్టెంబర్ 3నే ముగిసిందని తెలిపారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అత్యవసర జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో శివ్లాల్ యాదవ్, అర్షద్ ఆయూబ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.