పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మరో రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన బ్యాట్స్‌మన్(7)గా ఘనత సాధించాడు. ఇంగ్లాండుతో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీతో బాబర్ ఈ ఫీట్‌ని అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లాండు బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో(6)తో సమంగా బాబర్ ఉన్నాడు. తాజా సెంచరీతో బెయిర్‌స్టోని అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. కాగా, టెస్టులో బాబర్‌కి ఇది 8వ సెంచరీ. టీ20 ప్రపంచకప్‌లో విఫలమైన బాబర్ తిరిగి టెస్టుల్లో ఫామ్‌ని అందుకున్నాడు.