మరో 5 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కాబోతోంది. జట్లన్నీ సమరోత్సాహంతో బరిలోకి దిగబోతున్నాయి. ఈ క్రమంలో ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబయి ఇండియన్స్ కూడా మరోసారి కప్పుకొట్టాలని ఉవ్విల్లూరుతోంది. ఈ సందర్భంగా ముంబయి జట్టు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో సౌతాఫ్రికా హార్డ్ హిట్టర్, బేబీ డిలివియర్స్ గా పేరొందిన డివాల్డ్ బ్రీవిస్ పొలార్డ్ భారీ షాట్లు ఆడుతూ కనిపించారు. డివాల్డ్ ఇటీవల ముగిసిన అండర్-19 ప్రపంచకప్ లో భాగంగా వెలుగులోకి వచ్చాడు. 506 పరుగులు చేసి ఆ టోర్నీలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా, ముంబయి డివాల్డ్ ను వేలంలో రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది.