జంతువులను మనం ఎంత ప్రేమగా చూసుకుంటే అవి కూడా మనల్ని అంత ప్రేమిస్తాయి. ఈ వీడియోలో ఒక పిల్ల ఏనుగు తన సంరక్షకుడితో బెడ్ కోసం సరదాగా పోట్లాడుతుంది. అతడు బెడ్ మీద పడుకోవడం చూసి దగ్గరికి వచ్చిన ఏనుగు నేను కూడా బెడ్ మీద పడుకుంటాను అని పోటీకి దిగుతుంది. అతడు లేచి వెళ్లిపోయేంతవరకు వదలదు. తర్వాత ఇద్దరు కలిసి బెడ్ మీద పడుకుంటారు. ఈ వీడియోను అటవీ అధికారులు సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.