పాకిస్తాన్‌లోని కరాచిలో ఒక మేకపిల్ల 19 అంగుళాల పొడవైన చెవులతో పుట్టింది. ఆ మేకపిల్లను చూసి అందరూ ఆశ్ఛర్యపోతున్నారు. ఆ రైతు మేకపిల్ల పరును సింబా అని పెట్టాడు. త్వరలో అది గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కబోతుంది. సాధారణంగా నుబియన్ జాతికి చెందిన మేకపిల్లల చెవులు పొడుగ్గా ఉంటాయి. కానీ ఈ సింబా చెవులు అంతకంటే పొడవుగా ఉండటం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.