డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇకపై హెచ్‌బీఓ కంటెంట్ కనుమరుగు కానుంది. మార్చి 31 నుంచి ప్రసారాలు నిలిచిపోనున్నాయి. డిస్నీ ప్ల్లస్ హాట్‌స్టార్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. హెచ్‌బీఓ ఒరిజినల్ షోలను డిస్నీస్టార్ 2016 నుంచి ప్రసారం చేస్తోంది. ఇందుకోసం హెచ్‌బీఓతో 2015 డిసెంబర్‌లో ఒప్పందం చేసుకుంది. హాట్‌స్టార్ కాస్త 2020లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌గా మారిన తర్వాత కూడా ఈ ఒప్పందం కొనసాగింది. అయితే ఖర్చులను తగ్గించుకునే క్రమంలో హాట్‌స్టార్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం.