యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. ఈ మూవీ టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ టీజర్ కేజీఎఫ్-2 రిలీజ్ సమయంలోనే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇక మే చివరి వరకు అయినా ఈ మూవీ టీజర్ వస్తుందని అంతా భావించారు. కానీ సలార్ చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. సలార్ టీజర్ రావడానికి మరింత సమయం పడుతుందని చెప్పాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. సలార్ టీజర్ లో యాక్షన్ సన్నివేశాలకు చాలా ప్రాధాన్యత ఉండనున్నట్లు తెలుస్తోంది.