బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పంచతంత్రం’. ఐదు విభిన్న స్టోరీలతో ఆంథాలజీగా తెరకెక్కిన ఈ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. పంచేంద్రియాల కాన్సెప్ట్‌తో తీసుకున్న 5 కథలు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యాయని చెబుతున్నారు. బ్రహ్మీ ఓ ప్రత్యేక పాత్రలో అదరగొట్టారని పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. హర్ష పులిపాక దర్శకత్వంతో పాటు సంగీతం చాలా బాగుందంటున్నారు. సినిమా కాస్త స్లోగా స్టార్ట్ అయినా ఎమోషనల్‌గా మనల్ని కట్టిపడేస్తుందని చాలా మంది 5కి 3 పాయింట్లకు పైగా రేటింగ్ ఇస్తున్నారు.