KGF 2 దెబ్బకు బాహుబలి రికార్డ్స్ ఖతం

కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మూవీ KGF 2. నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. విడుదలైన అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తుంది. అయితే ఈ మూవీ బాలీవుడ్‌లో బాహుబలి2 రికార్డును దాటేసింది. అక్కడ విడుదలైన మొదటిరోజే సుమారుగా రూ.60 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. KGF 2 కంటే ముందు బాహుబలి 2 రూ.58 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఆ ప్లేస్‌ని KGF ఆక్రమించింది. కాగా రెండోరోజైన నేడు కూడా ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి.

Exit mobile version