ప్రగతిభవన్ ముట్టడికి యత్నించి అరెస్ట్ అయిన వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు అయ్యింది. నర్సంపేటలో వైతెపా వాహనాల దాడిని ఖండిస్తూ హైదరాబాద్ లో షర్మిల చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రగతిభవన్ ముట్టడికి షర్మిల కాన్వాయిలో రాగా…పెద్ద సంఖ్యలో శ్రేణులు తరలివచ్చారు. ఆమె వాహనాన్ని పోీలీసులు అడ్డుకున్నారు. షర్మిలను బయటకు రావాలని కోరగా దిగకపోవటంతో ఆమె కారులో ఉండగానే క్రేన్ తాడుతో కట్టిస్టేషన్ కు తీసుకెళ్లారు.