పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకు బెయిల్ మంజూరైంది. హైదరాబాద్‌లో చిత్తూరు పోలీసులు నిన్న అతడిని అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి సులోచనారాణి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌గా 2014లోనే రాజీనామా చేసినప్పటికీ పోలీసులు తప్పుడు అభియోగం మోపి అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం లీక్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించాారు.