కమెడియన్ ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ జంటగా తెరకెక్కిన ‘బలగం’ మూవీ ఓటీటీ హక్కులను భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఏప్రిల్ రెండో వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రంతో ‘జబర్దస్త్’ కమెడియన్ వేణు యెల్దండ తొలి సారి దర్శకుడిగా మారాడు. తెలంగాణ పల్లె సంస్కృతి అద్దం పట్టేలా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటోంది.